నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా కేవలం ఒకే ఒక ఉద్యోగ ఖాళీని భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 2023 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి వయస్సు గరిష్టంగా 48 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్లకు అనుగుణంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీకి దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2023 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా అక్టోబర్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంస్థ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైతే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో రాబోయే ఆరు నెలలు ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.