కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని భారీ సంఖ్యలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలతో పాటు నన్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
www.cdn.digialm.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెల 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 37 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఉద్యోగ ఖాళీలకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతర అర్హతలు ఉండాలి.
కొన్ని ఉద్యోగ ఖాళీలకు బీటెక్ అర్హత కచ్చితంగా ఉండాలి. సంబంధిత బ్రాంచ్ లో బీటెక్ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టం 1,77,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. www.iwai.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.