ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1603 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. iocl.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. యువతలో వర్క్ స్కిల్స్ పెంచాలనే ఆలోచనతో ఈ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధం కావడం గమనార్హం. డిసెంబర్ 16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
జనవరి నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ విభాగాల్లో అప్రెంటీస్ లను నియమిస్తూ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రాల వారీగా ఉద్యోగ ఖాళీలు వేర్వేరుగా ఉండగా వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.
2023 సంవత్సరం నవంబర్ నాటికి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్స్ తో పాటు క్యాన్సిల్డ్ చెక్, పాన్‌కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.