నిరుద్యోగులకు అదిరిపోయే అద్భుతమైన తీపికబురు.. 240 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలనేది ఎంతోమంది కల అనే సంగతి తెలిసిందే. ఐటీఐ చేసి మంచి ఉద్యోగం కొరకు ఎదురుచూసే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఈ జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. నావల్ షిప్ రిపేర్ యార్డ్, నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్, కొచ్చి అప్రెంటిస్‌షిప్స్‌ ఉద్యోగ ఖాళీల కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్ విభాగాలతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మొత్తం 240 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్‌ ఫామ్‌ డౌన్‌లోడ్ చేసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 19వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండగా ఎంపికైన అభ్యర్థి భారత నౌకాదళంలో పని చేయాల్సి ఉండనుందని సమాచారం అందుతోంది.

వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ పొజిషన్‌లు అందుబాటులో ఉండగా కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. సంబంధిత ట్రేడ్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దరఖాస్తుదారులకు గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలుగా ఉంది.

రిజర్వడ్‌ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులు ఉండనున్నాయని భోగట్టా. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన వాళ్లకు ఐదేళ్లు వయో పరిమితి సడలింపులు ఉండనుండగా ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపులు ఉండనున్నాయి. https://www.indiannavy.nic.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.