జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

మనలో చాలామందిని వేర్వేరు సందర్భాల్లో జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆ సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్లను జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుంది. జీలకర్రను నమలడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయని సమాచారం.

నీళ్లలో జీలకర్రను నానబెట్టి ఆ నీళ్లను తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నెలరోజుల పాటు ఈ నీళ్లను తాగడం ద్వారా మలబద్ధకం, అజీర్తి సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. మరిగించిన నీటిలో జీలకర్రను వేసి జీలకర్ర కషాయాన్ని వడగట్టి పరగడుపున తీసుకోవడం ద్వారా ఊబకాయం సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయని చెప్పవచ్చు.

జీలకర్రకు బదులుగా వామును తీసుకోవడం ద్వారా ఇదే తరహా ఫలితాలను పొందవచ్చు. పరిమిత మోతాదులో వామును వాడటం ద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. తులసి, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆకులతో సహా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్స్ ఉంది.

గ్లాస్ నీటిలో ఇంగువను కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అల్లం రసం తాగడం ద్వారా అజీర్తి, పైత్యం లాంటి సమస్యలు దూరమవుతాయి. అరగ్లాస్ నీటిలో అల్లం తురిమి వేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ చిట్కాలను పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.