Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు ఏ దిశలో పెట్టాలో తెలుసా?

Vastu Tips: మన ఇంటిని శుభ్రం చేయాలంటే తప్పనిసరిగా చీపురు అవసరం మనకు ఎంతగానో ఉంటుంది. ఇలా చీపురుతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని మొత్తం శుభ్రం చేస్తూ ఉంటాము. అయితే చీపురుని సాక్షాత్తు లక్ష్మీ దేవిగా భావిస్తూ ఉండటం వల్ల చీపురికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.అందుకే చీపురును ఎలా పడితే అలా ఉపయోగించకూడదని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదని చెబుతారు.అదేవిధంగా వాస్తు ప్రకారం చీపురును మన ఇంట్లో సరైన దిశలోనే ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

మరి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఏ దిశలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. అసలు చీపురును ఏ దిశలో ఉంచడం ఉత్తమం అనే విషయాలను తెలుసుకుందాం…మన ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురుని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా కేవలం పశ్చిమదిశలో మాత్రమే ఉంచాలి. అదేవిధంగా నైరుతి దిశలో కూడా చీపురు పెట్టడానికి అనువైన దిశగా భావిస్తారు.

ఈ రెండు ప్రదేశాలలో చీపురుని ఉంచడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రతికూల శక్తి ఉండదు.వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఎవరికీ కనిపించకుండా పెట్టాలి ముఖ్యంగా పడక గదిలో ఎలాంటి పరిస్థితులలో కూడా చీపురు ఉండకూడదు.ఒకవేళ మీ కలలో కనుక చీపురు కనిపించినట్లయితే మిమ్మల్ని మీరు ఎంతో అదృష్టవంతులు అని భావించవచ్చు. చీపురు కలలో కనిపించడం శుభప్రదమని చెప్పవచ్చు. చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు కనుక ఈ చీపురు విషయంలో చాలా జాగ్రత్తలు నియమాలను పాటించాలి.