ఇంట్లో దుర్వాసన వెలవడుతుందా.. అయితే ఈ సహజ చిట్కాలను పాటించాల్సిందే!

మనలో ఒత్తిడిని జయించి మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవాలంటే సంపూర్ణ పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ముఖ్యంగా మన ఇల్లు అపరిశుభ్రంగా,దుర్వాసన వెదజల్లుతూ ఉంటే మనలో మానసిక అశాంతి కలగడం సర్వసాధారణ. మన ఇంటిని శుభ్రపరచుకోవడానికి సువాసనలు వెదజల్లడానికి కొందరు ఆర్టిఫిషియల్ రూమ్ స్పేయర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు దీని వల్ల మన ఆరోగ్యం మరియు పిల్లల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. పైగా రూమ్స్ స్ప్రే వల్ల వచ్చే సువాసన కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత మామూలే.

మన ఇంటి లోపల మరియు ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని ఎల్లప్పుడు శుభ్రంగా, సువాసన భరితంగా ఉంచుకోవాలంటే కొన్ని సహజ పద్ధతులు అలవర్చుకుంటే సరిపోతుంది. ముందుగా మన ఇంటిని ఇంటి లోపల వస్తువులన్నిటిని కనీసం రెండు లేదా మూడు నెలలకు ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి. ఎల్లప్పుడూ కిటికీల తెరిచి ఉంచడం వల్ల ఇంట్లో చెడు దుర్వాసనలు బయటికి వెళ్లి గాలి వెళ్తురు సక్రమంగా అందుతుంది.బేకింగ్ సోడా చెడు వాసనను గ్రహించి చుట్టూ ఉన్న వాతావరణాన్ని తాజాగా ఉంచుతుంది.కాబట్టి చెడు వాసనను త్వరగా పోగొట్టుకోవడానికి ఇంట్లో ప్రతి మూలలో బేకింగ్ సోడా ఉంచటం మంచిది. అలాగే రిఫ్రిజిరేటర్‌లో బేకింగ్ సోడా కంటైనర్‌ను ఉంచడం వల్ల ఇతర ఆహార పదార్థాల దుర్వాసన గ్రహించి ఫ్రిజ్లో ఉండే ఆహార పదార్థాలను ఫ్రీజ్ ను ఎప్పుడు తాజాగా ఉంచుతుంది.

మన ఇంటి లోపల శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్ కూడా శుభ్రంగా ఉంచడం అంతే ముఖ్యం. దీనికోసం మన ఇంటి పెరట్లో ఔషధ గుణాలు మరియు సువాసనలు వెదజల్లే మొక్కలను నాటుకోవడం మంచిది.తులసి, చియా మొక్క, పుదీనా, కొత్తిమీర, లెమన్ గ్రాస్ వంటి మొక్కలను పెంచుకోవడం వల్ల వీటినుంచి వెలుపడే సహజ సువాసన లు మన చుట్టూ ఉన్న వాతావరణం తాజాగా ఉంచుతాయి. అలాగే రోజ్మేరీ, నిమ్మకాయ, పిప్పరమింట్, దాల్చిన చెక్క, నారింజ వంటి నూనెలతో కూడిన డిఫ్యూజర్‌ను ఉపయోగిస్తే మీ ఇంటిని ఎక్కువ రోజులు సువాసన భరితంగా ఉంచుకోవచ్చు.