మీ ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యకు సులువుగా చెక్!

సాధారణంగా కాలంతో సంబంధం లేకుండా చీమల సమస్య వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను సులువుగా దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సింపుల్ చిట్కాల ద్వారా చీమలు మళ్లీ ఇంట్లోకి రాకుండా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

మన ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో కారం ఒకటి కాగా కారప్పొడి చీమల్ని దూరం చేస్తుంది. కర్పూరం, తులసి చీమలను సులువుగా దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. కర్పూరాన్ని, తులసి రసాన్ని ఇంటి మూలల్లో స్ప్రే చేయడం ద్వారా చీమల నుంచి రక్షించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. టీట్రీ ఆయిల్ ను నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల చీమల సమస్య దూరమవుతుంది.

యూకలిప్టస్ ఆయిల్ ప్రత్యేక గుణాలను కలిగి ఉండగా యూకలిప్టస్ ఆయిల్, నిమ్మరసాన్ని సమాన పరిమాణంలో తీసుకుని దూదిని ముంచి మూలలో పెడితే చీమల సమస్య దూరమవుతుంది. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు నీటిలో వెనిగర్ వేసి తుడిస్తే చీమల సమస్య దూరమవుతుంది. ఇంట్లో ఏదైనా ఓ చోట చీమలు గూడు పెట్టినట్లుగా ఉంటే అక్కడ వేడినీటిని పోయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది.

మొక్కజొన్న పిండితో కూడా చీమల సమస్యను దూరం చేసుకోవచ్చు చీమలు ఉన్న చోట కొద్దిగా మొక్కజొన్న పిండి చల్లి ఆ తర్వాత నీరు పోయడం ద్వారా కూడా ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. వేపనూనెను నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా కూడా చీమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాడేసిన కాఫీ పొడిని చీమలు తిరిగే చోట చల్లితే అది చీమల సమస్యను సులువుగా దూరం చేసుకోవచ్చు.