అందంగా, తెల్లగా కనిపించాలనుకునుకుంటున్నారా.. ఈ ఫేస్ ప్యాక్స్ తో గ్లామర్ గా కనిపించొచ్చంటూ?

మనలో చాలామంది తెల్లని చర్మంతో, అందంగా కనిపించాలని భావిస్తుంటారు. కొంతమంది అందంగా కనిపించడం కోసం తరచూ బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. అయితే బ్యూటీపార్లర్లలో ఉపయోగించే క్రీమ్స్ వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంట్లో తయారు చేసిన పేస్ పాక్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటంతో పాటు మరింత అందంగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి.

పాలు, తేనే, పెరుగు, వోట్స్ మరియు పండ్ల రసాలతో ప్యాక్స్ వేస్తే ఎలాంటి హాని కలగదని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చర్మం సుకుమారంగా ఉంటుంది. గంధం పేస్ ప్యాక్ ను ఉపయోగించడం ద్వారా చర్మం నునుపుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ను వాడటం ద్వారా చర్మం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఆపిల్ ఫేస్ ప్యాక్ ద్వారా చర్మ ఛాయ సులువుగా మెరిసే అవకాశం ఉంటుంది. కీరకాయ ఫేస్ ప్యాక్ ద్వారా ముఖంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. తేనెతో ఫేస్ ప్యాక్ వేయడం ద్వారా చర్మంగా మరింత అందంగా కనిపిస్తుంది. కలబందలో ఉండే జెల్ ను ముఖానికి అప్లై చేస్తే మంచిది. పసుపు ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయడం ద్వారా మొటిమలు తొలగిపోవడంతో పాటు అద్భుతమైన ఫెయిర్ నెస్ స్కిన్ ను పొందే అవకాశం ఉంటుంది.

పాలతో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుంటే కాటన్ బాల్స్ ను పాలలో డిప్ చేసి ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఈ విధంగా చేస్తే అద్భుతమైన చర్మ ఛాయ సొంతమవుతుంది. బంగాళదుంప ఫేస్ ప్యాక్  ముఖానికి అప్లై చేస్తే మంచిది. ఈ ఫేస్ ప్యాక్ ను ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది.