కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Job-Vacancy

నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది. nwda.gov.in వెబ్ సైట్ ను సంప్రదించడం ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

 

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 18వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 17వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా సంస్థ వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ అకౌంటెంట్స్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2, అప్పర్ డివిజిన్ క్లర్క్, డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 3 ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈ.డబ్ల్యూ.ఎస్ అభ్యర్థులకు 890 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగిలిన వాళ్లకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది.

 

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వేషన్ ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది.