నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న భారతీయులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27వ తేదీ లోపు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనవరి 3వ తేదీ లోపు ఇందుకు సంబంధించిన పోస్ట్ ను పంపాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
బీఈ, బీటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 30000 రూపాయల నుంకి 1,20,000 రూపాయల వరకు వేతనన లభించనుంది.
18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా 27వ తేదీ చివరి తేదీగా ఉంది. ఉద్యోగాలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జత చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది.