నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రత్యక్ష ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ జనరల్ మేనేజర్ 1 ఖాళీ ఉండగా అసిస్టెంట్ మేనేజర్ 1 భర్తీ కానుంది. మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 5 భర్తీ కానుండగా సీనియర్ ట్రైనీ ఉద్యోగాలు 2, ట్రైనీ ఉద్యోగ ఖాళీలు 179 భర్తీ కానున్నాయి.
మెకానిక్, బ్లాక్ స్మిత్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, స్టెనోగ్రాఫర్, అకౌంట్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్, హెచ్.ఆర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 188 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
విద్యార్హతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 24,616 రూపాయల నుంచి 1,41,260 రూపాయల వరకు వేతనం లభించనుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు 50 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు 30 ఏళ్లు అర్హత కాగా మిగతా ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంటుంది.