నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా అదిరిపోయే ప్రకటన వెలువడింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 35 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్-ఫైనాన్స్) ఉద్యోగాలకు నెలకు లక్ష రూపాయల వేతనం లభించనుండగా ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్) ఉద్యోగాలకు నెలకు 90,000 రూపాయల వేతనం లభించనుంది. ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్) ఉద్యోగ ఖాళీలకు సైతం నెలకు 90000 రూపాయల వేతనం లభించనుందని భోగట్టా.
జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభించనుండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను ఎన్టీపీసీ భర్తీ చేస్తుండటం గమనార్హం. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.