నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 153 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం నిరుద్యోగులకు ఎంతో బెనిఫిట్ కలిగించనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయో పరిమితి 32 సంవత్సరాలను మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఏకంగా పది సంవత్సరాల వయో పరిమితి సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 37 వేల రుప్పాయల నుంచి 1,30,000 రూపాయల వరకు స్టైపెండ్ లభించనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

జనరల్, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2024 సంవత్సరం నవంబర్ 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.