నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 43 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. nhb.org.in వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా 2023 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఫైనాన్స్ జాబ్ 1 ఉండగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 1, ఎకనామిస్ట్ 2, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 3, జర్నలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 16, హిందీ 1, చీఫ్ ఎకనామిస్ట్ 1, సీనియర్ అప్లికేషన్ డెవలపర్ 1, అప్లికేషన్ డెవలపర్ 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 7 ఉండగా ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉండనుంది. nhb.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు చేకూరుతుంది.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.