NASA: భూమికి 410 కి.మీ ఎత్తులో వ్యోమగాములు..! వీడియో వైరల్

NASA: అంతరిక్షం ఎప్పుడూ ఆసక్తికరమే. అంతరిక్ష యాత్ర.. స్పేస్ వాక్ చేసే మనుషుల కదలికలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. అంతరిక్ష రహస్యాల్లానే స్పేస్ లో మనుషులను విచిత్రంగా అనిపిస్తూంటారు. అటువంటి అద్భుతాన్నే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) షేర్ చేసింది. ఇంటి డాబా పైనుంచి కిందికి చూస్తేనే ఒక్క క్షణం కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. అటువంటిది భూమికి 410 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమగాముల కదలికలు చూస్తే ఆశ్చర్యంగానూ ఉంటుంది.. ఒళ్లు గగుర్పొడుస్తుంది కూడా.

నాసా షేర్ చేసిన ఈ వీడియో భూమికి 255 మైళ్లు (410 కిలోమీటర్లు) ఎత్తులో తీసిన దృశ్యం. ‘వ్యోమగాములు థఆమస్ పిస్క్వెట్, షేన్ కింబ్రౌ అంతరిక్ష కేంద్రంలో విద్యుత్ సరఫరాను సరి చేస్తున్నారు. ఈ వీడియోలో ఒక వ్యోమగామి అంతరిక్షంలో కదలాడుతూ.. ఆయన కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తీక్షణంగా చూస్తేనే ఆయన కనిపిస్తారు. రెండో వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి అటువైపు ఉండడంతో కనిపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. నెటిజన్లను ఆకర్షిస్తోంది.