మనలో చాలామంది విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వైరస్ ల బారిన పడకుండా ఉండాలని కొంతమంది, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని మరి కొందరు విటమిన్ ట్యాబ్లెట్లను వాడుతున్నారు. అయితే శరీరంలో విటమిన్ల స్థాయిని పెంచుకోవడం కోసం ట్యాబ్లెట్లపై ఆధారపడటం ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన విషయాల ప్రకారం వైద్యుల సలహాలు లేకుండా విటమిన్ల ట్యాబ్లెట్లను వాడితే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అదే పనిగా విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. శరీరంలో విటమిన్ల స్థాయి మోతాదుకు మించి ఎక్కువైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
విటమిన్ల స్థాయి ఎక్కువైతే గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కంటిచూపు కోసం వాడే విటమిన్ ఎ ఎక్కువైతే కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే విటమిన్-ఇ అధికంగా తీసుకుంటారో వారికి కంటి కాంతి తగ్గుతుందని వెల్లడైంది. విటమిట్-డి ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడితే శరీరంలో కాల్షియం స్థాయి అధికమవుతుంది.
వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకుంటే నష్టపోయే అవకాశం అయితే ఉండదు. ఒక్కసారే విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల వేర్వేరు అవయవాలపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. విటమిన్ ట్యాబ్లెట్లను వినియోగించే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.