మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ట్రైనీ క్లర్క్స్, ట్రైనీ జూనియర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బ్యాంక్ అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎంఎస్‌సీ బ్యాంక్ మొత్తం 153 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ ఆఫీసర్ గ్రేడ్-ఒక పోస్ట్, ట్రైనీ క్లర్క్ ఉద్యోగ ఖాళీలు 107 ఉండగా ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలు 45 ఉన్నాయి. 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనీ క్లర్క్ ఉద్యోగ ఖాళీలకు 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులు. ర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ట్రైనీ జూనియర్ ఆఫీసర్స్, స్టెనో టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 1770 రూపాయలు కాగా ట్రైనీ క్లర్క్ కోసం దరఖాస్తు ఫీజు 1180 రూపాయలుగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.