గోధుమ పిండితో నోరురించే బ్రేక్ ఫాస్ట్.. ఎలా చేయాలంటే!

ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమపిండి చిటికెడు ఉప్పు వేసి కాస్త నీళ్లు వేసి కలుపుకోవాలి. గట్టిగా లేకుండా దోస పిండి లాగా ఉండేవిధంగా నీళ్లు వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఒక బాణీలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి లైట్ గా వేయించిన తర్వాత అందులో తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేయాలి. కొద్దిసేపటి తర్వాత అందులో తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి ఎర్రగా వచ్చేవరకు వేయించుకోవాలి. తరువాత అందులో కొద్దిగా తరిగిన అల్లం, తరిగిన రెండు టమాటాలు, కొద్దిగా కరివేపాకు తగినంత ఉప్పు వేసి బాగా వేయించాలి.

తరువాత ముందుగా కలిపి ఉంచిన గోధుమ పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి, కొద్దిగా కోతిమీర వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక బాణీలో కొద్దిగా నూనె వేసి స్పూన్ తో బాణీలో అంతా తిప్పాలి. తరువాత ఒక చెంచా తో ఆ పిండిని దోశలు లాగా వేసుకోవాలి. తరువాత ఎర్రగా అయ్యేవరకు కాల్చుకోవాలి.

తర్వాత దానిని రౌండ్ గా చుడితే ఇంకేముంది మనకు కావాల్సిన మంచి బ్రేక్ ఫాస్ట్ తయారు అయిపోయినట్టే. చూశారుగా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవడం ద్వారా మంచి రుచి, ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండవచ్చు. బయట దొరికే ఆహార పదార్థాల వల్ల పదార్థాల వల్ల ఆరోగ్యం పాడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో దీనిని ట్రై చేయండి.