జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు అవసరమైన ఇంటి చిట్కాలు ఇవే.. ఆ ఆహారాలు తింటే చాలంటే?

మనలో చాలామంది జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. పిల్లలకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటే సులువుగా మొమరీ పవర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి మంచివి కాగా బ్రెయిన్ లోని న్యూరాన్లు సరిగ్గా పని చేసేలా చేయడంలో ఇవి తోడ్పడతాయి. పిల్లలకు బ్రకోలీ ఇవ్వడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. విటమిన్ కే పుష్కలంగా ఉండే బ్రకోలి కేంద్ర నాడీ వ్యవస్థ సరిగ్గా పని చేసేలా చేయడంతో పాటు బ్రెయిన్ హెల్త్ కు ఉపయోగపడుతుంది.

నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా శరీరంలో మాంసకృత్తులు, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, ఖనిజాలు పెరుగుతాయి. పిల్లల నాడీ వ్యవస్థని ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ఇవి సహాయపడతాయి. పిల్లలకు ఇచ్చే ఉత్తమమైన ఆహారాలలో చేపలు కూడా ఒకటి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్న చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు తరచూ చేపలను తింటే మంచిదని చెప్పవచ్చు.

పిల్లలు ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లలు గుడ్లు తినడం ద్వారా జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లభించే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ చిట్కాలు పాటించినా మెమొరీ పవర్ పెరగకపోతే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. జ్ఞాపకశక్తి పెంచుకోవాలని భావించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.