ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలో 10,391 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 10,391 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రెండు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కాగా టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది.

గతంలో నాలుగు వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ప్రస్తుతం 6,329 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. https://emrs.tribal.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టీజీటీ, లైబ్రేరియన్‌, హాస్టల్‌ వార్డెన్‌ ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

బీఈడీతో పాటు ఇతర అర్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సీటెట్ ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే టీజీటీ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీజీటీ పోస్టులకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలు కాగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులకు పరీక్ష ఉండగా హాస్టల్ వార్డెన్‌ రాత పరీక్షకు 120 మార్కులు ఉంటాయి. ల్యాబ్‌ అటెండెంట్‌ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 18000 రూపాయల నుంచి 112400 రూపాయల వరకు వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.