మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్ … పూర్తి వివరాలు మీకోసం!

170688-pm-modi-new-pti

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చింది.దేశ ప్రజలలో ఆర్థిక భద్రత పెంపొందించడం కోసం మోడీ సర్కార్ ఇప్పటికే తీసుకువచ్చినటువంటి పథకాల ద్వారా ఎంతో మంది పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు.పోస్టాఫీస్ పథకాలు, LIC పథకాలు వంటి వాటిని ప్రజలకు చేరువ చేసింది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో మరో కొత్త స్కీమ్‌పై కూడా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఆ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం…

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి పథకాలలో స్కీమ్ పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. వన్- టైమ్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఇది. ఈ స్కీం ద్వారా మహిళలు లేదా ఆడపిల్లలు పేరుమీద డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది ఈ పథకంలో గరిష్టంగా ఒక్కొక్కరు రెండు లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 7.5 శాతం ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేటు వస్తుంది. అంటే 7.5 శాతం వడ్డీ ని ఈ స్కీమ్ ద్వారా పొందొచ్చు.
ఒకేసారి ఇందులో డబ్బులు పెట్టాలి.

ఈ పథకం 2025 వరకు అందుబాటులో ఉంటుంది.చిన్న పొదుపు పథకాల కంటే కూడా ఈ స్కీమ్ లో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఈ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది. రెండేళ్ల లాక్- ఇన్ పీరియడ్ ఉంటుంది. అలానే కావాలంటే మధ్యలో విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్స్ అయితే వీరికి వడ్డీ 8 శాతం పొందవచ్చు అయితే ఇది లాంగర్ లాక్- ఇన్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇక సుకన్య సమృద్ధి యోజన కింద ఏడాదికి 7.6% వడ్డీ ఈ పథకం ద్వారా పొందవచ్చు.