కోపంతో బంధాలను కోల్పోతున్నారా… కోపాన్ని ఇలా నియంత్రణలో ఉంచుకోండి!

సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక విషయంలో కోపం రావడం సర్వసాధారణం అయితే కొందరు ప్రతి చిన్న విషయానికి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతరులను కించపరుస్తూ ఉంటారు. ఇలా ఇతరుల విషయంలో ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల అవతలి వాళ్ళు ఎంత బాధపడతారో ముందుగా అర్థం చేసుకోవాలి.అయితే ఇలా మాటిమాటికి ఆగ్రహం వ్యక్తం చేయటం వల్ల కొన్ని విలువైన బంధాలను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. అయితే తరచూ కోపం తెచ్చుకునేవారు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.

ఒక విషయం గురించి మనం ఇతరులతో మాట్లాడుతున్నామంటే ఆ మాట మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. ఇలా మాట్లాడటంతో కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.ఒకవేళ తప్పు కనుక మీ వైపు ఉంటే తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలి. ఇలా క్షమాపణలు చెప్పడం కోపాన్ని నియంత్రించడానికి ఒక ఆయుధమని చెప్పాలి. ఇలా తరచూ మీకు కోపం రావడానికి గల కారణాలు ఏంటి.. ఇతర వ్యక్తుల నుంచి మీరేం ఆశిస్తున్నారో తెలుసుకోవాలి.

మనం ఇతరులు పట్ల కోపం ప్రదర్శించేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించాలి.ఇలా అవతలి వారి స్థానంలో మీరు ఉండే ఆలోచిస్తే ఇతరులపై కోపం ప్రదర్శించే ముందు ఒకసారి ఆలోచిస్తారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మనకు ఒత్తిడి తగ్గి కోపం తెచ్చుకోకుండా ఉంటారు. అలాగే మనం ఏ పని చేస్తున్న పనిలో కాస్త విరామం తీసుకుని పనిచేయడం వల్ల కోపం తగ్గుతుంది. కోపం తెప్పించే అంశాలు అన్నింటిని ఒకచోట రాసుకుని వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలి. ఇక ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల మన నుంచి కోపం దూరమవుతుంది.