ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు బాధపడుతున్నటువంటి సమస్యలలో సెక్స్‌సోమ్నియా.. దీనినే స్లీప్ సెక్స్ అని కూడా అంటుంటారు. ఇది ఒక రకమైన నిద్ర రుగ్మత. సెక్స్‌స్నోమియా(Sexsomnia) అనే రుగ్మత వచ్చిన వారు నిద్రలో సెక్స్ చేస్తారు.వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం వాళ్ళు చూడటానికి మెలకువలు ఉన్నట్టు అనిపిస్తారు కానీ నిద్రపోతూనే ఉంటారు.
ఈ వ్యాధితో బాధపడేవారు నిద్రిస్తున్నప్పుడు సంభోగం చేశారనే విషయాన్ని మరచిపోతారు. చాలా మంది ఈ వింత వ్యాధితో బాధపడుతున్నారు. ముందుగా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలు ఉన్న వ్యక్తిలో సెక్స్‌సోమ్నియా సంభవించవచ్చు. ఇక ఈ వ్యాధితో బాధపడే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే విషయానికి వస్తే..
హస్తప్రయోగం, రమ్మని పిలవడం, సంభోగం, లైంగిక వేధింపు, శబ్ధాలు చేయడం, నిద్రపోతున్నప్పుడు చెడుగా మాట్లాడటం వంటి లక్షణాలు కనబడుతుంటాయి అయితే ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే..
అధిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు మద్యం లేదా ఇతర ఔషధాల వినియోగం. ముందుగా ఉన్న పారాసోమ్నియా ప్రవర్తనలు, కోపం, గందరగోళం వంటి సమస్యలు ఈ వ్యాధికి కారణమవుతాయి. ఈ వ్యాధితో బాధపడే వారికి ఎలాంటి ఔషధం లేదని కేవలం మానసికంగా మనం చేసే ఆలోచనలపై ఈ వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుంది.