అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించాలి..?

details of tirumala venkateswara pooja

మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం నిరంతరం మనపై ఉంటుందని ప్రజల నమ్మకం. ఇక కలియుగ దైవంగా భావించి శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించటం వల్ల వేంకటేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ని ఇలా వైకుంఠం గా భావిస్తారు. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి కి ప్రీతికరమైన శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందటానికి ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శనివారం రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి నుదిటి మీద తిరుణామాన్ని ధరించాలి. ఆ తర్వాత ఇంట్లో పూజగది , వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఫొటోలు శుభ్రం చేసి పువ్వులతో అలంకరించాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి. ఇక స్వామి వారికి ఈటమైన పండ్లు, ఫలాలు, చెక్కెర పొంగలి,పాయసం, గారెలు పులిహార, కలకండ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి. పూజా సమయంలో ” ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వేంకటేశ్వరుడిని ఆరాధించాలి. ఆ తరుత స్వామీ వారికి కర్పూర హారతులు ఇచ్చి పూజ ముగించాలి.

పూజ సమయంలో “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని జపించడానికి కారణం ఏమిటంటే సాక్షాత్తు ఆ నారాయణుడే కలియుగంలో భక్తులు కష్టాలను తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర రూపంలో భూలోకంలో కొలువై ఉన్నాడు. ఇక శనివారం రోజున ఉపవాసం ఉండడం ఉండాలి. అలాగే సాయంత్రం వేళలో కూడా స్వామీ వారికి దీపారాధన చేసి పారాయణం చేయాలి. ఆ తరువాత ఉపవాస దీక్ష విరమించవచ్చు. అంతే కాకుండా శనివారం రోజున మాంసాహారం ముట్టకుండా చాలా నిష్టగా ఉండాలి. ఇలా ప్రతి శనివారం రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం కలిగి కష్టాలు తొలగిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.