శనివారం వేంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే అప్పులు తీరతాయట.. ఏం చేయాలంటే?

హిందువులలో చాలామంది భక్తులు వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడానికి ఇష్టపడతారు. ప్రతి సంవత్సరం తిరుమలను సందర్శించే కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే ఎలాంటి కష్టం అయినా తీరుతుందని శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు. అప్పులు, ఆపదలు సమస్యలు ఉంటే 8 శనివారాలు వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

8 శనివారాలు ఈ విధంగా పూజించడం ద్వారా వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉండటంతో పాటు దోషాలన్నీ తొలగిపోతాయి. దేవుడి గుడిని శుభ్రం చేసి బియ్యపు పిండిలో పాలు పోసి అరటి పండు ముక్క, బెల్లం ముక్కతో ప్రమిద చేసి ప్రమిదలో 7 వొత్తులు చేసి స్వామి పటం ముందు పూజ చేయడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటిస్తూ దేవుడిని పూజిస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది.

వేంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా శనిదోషం కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. తెల్లవారుజామున తులసికోట ముందు ఆవు నెయ్యితో, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వేంకటేశ్వర ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.

శ్రీవారిని పూజించే రోజున ఇంటిముందు రంగవల్లికలు వేసి భక్తిశ్రద్ధలతో స్వామిని పూజిస్తే మంచిది. స్వామికి తులసీదళాలతో అర్చన చేయడంతో పాటు ధూపదీపనైవేద్యాలను సమర్పించుకొని పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి,పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పూజ చేసే సమయంలో ఓం నమో నారాయణా అనే మంత్రాన్ని జపించాలి.