నార్త్ వెస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగ ఖాళీలతో పాటు వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
rrc జైపూర్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆగష్టు నెల 3వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
rrcjaipur.in వెబ్ సైట్ కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 312 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 209 ఉండగా టెక్నీషియన్ iii ఉద్యోగాలు 16, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 44, గార్డ్/ట్రైన్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 46 ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పది పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
18 సంవత్సరాల వయస్సు నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఆలవెన్స్ లు కూడా ఉండనున్నాయని సమాచారం అందుతొంది.