రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ జైపూర్ విభాగం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ షిప్ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. మొత్తం 1646 అప్రెంటీస్ షిప్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. https://rrcjaipur.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి నెల 10వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రైల్వేలో ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా సమానమైన కోర్సు పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉండగా నిబంధనల ఆధారంగా కొంతమందికి మాత్రం వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. www.rrcjaipur.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ట్రేడ్‌లో ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను తయారు చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రైల్వేలో ఉద్యోగ ఖాళీలను కోరుకునే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.