ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ.. ఒకేసారి సులువుగా ఏకంగా రూ.54 లక్షలు పొందే ఛాన్స్

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్తకొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తుండగా ఈ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందనే సంగతి తెలిసిందే. ఎల్ఐసీ పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి సులువుగా ఏకంగా 54 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

 

ఎవరైతే జీవన్ లాభ్ పాలసీని తీసుకుంటారో వాళ్లు రెండు రకాల బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ పాలసీ ఎండోమెంట్ ప్లాన్ కాగా ఈ పాలసీ తీసుకున్న వాళ్లు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు సేవింగ్స్ ను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెచ్యూరిటీ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్, లోన్ ఫెసిలిటీతో పాటు డెత్ బెనిఫిట్ ను ఈ పాలసీ ద్వారా తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే మరింత ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది.

 

30 సంవత్సరాల వయస్సులో 20 లక్షల రూపాయలకు పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో 54 లక్షల రూపాయలు పొందవచ్చు. ఏడాదికి దాదాపుగా 90,000 రూపాయలు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకునే టెన్యూర్ ఆప్షన్ ను బట్టి పొందే ప్రీమియంలో మార్పులు ఉంటాయి. గరిష్టంగా 59 సంవత్సరాల వయస్సు వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు.

 

ఈ పాలసీ తీసుకునే వాళ్లు ఈ పాలసీ గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు. పాలసీ టర్మ్ 16 ఏళ్లు, 21 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉండగా పాలసీ టర్మ్ ఆధారంగా చెల్లించే ప్రీమియంకు సంబంధించి మార్పులు ఉంటాయి. ఎల్ఐసీ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.