దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో లాభాలను పొందవచ్చు. ఈ సంస్థ వేర్వేరు పాలసీలను అందిస్తున్నా కొన్ని పాలసీలకు మాత్రమే మంచి పేరు వచ్చింది. అలాంటి పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీలో నెలకు రూ.7 వేలు చెల్లిస్తే రూ.54 లక్షలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా జీవిత బీమా కవరేజీ లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
అదే సమయంలో ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు సేవింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అవుతుంది. పాలసీ టర్మ్ ముగిసే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే ఒకేసారి భారీ మొత్తంలో నగదు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకుంటే డెత్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్, లోన్ ఫెసిలిటీ, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.
30 సంవత్సరాల వయస్సులో రూ.20 లక్షల బీమా కవరేజీ తీసుకుంటే రూ. 7,572 నెలవారీ ప్రీమియంగా ఉంటుంది. ఎంచుకునే బీమా మొత్తంను బట్టి ప్రీమియం మారుతుంది. ఎంచుకునే పాలసీ టర్మ్ ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత అన్ని ప్రీమియం మొత్తంతో పాటు బోనస్ లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎల్ఐసీ పాలసీలు తీసుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు.
తక్కువ వయస్సులో పాలసీలను తీసుకోవడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయి. పాలసీలను తీసుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు. పాలసీలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో బాధ పడాల్సి ఉంది. ఈ పాలసీల వల్ల లాభాలే తప్ప నష్టాలు ఉండవని చెప్పవచ్చు.