ఎల్ఐసీ సూపర్ పాలసీ.. నెలకు రూ.50 వేలకు పైగా పెన్షన్ ను పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా నెలకు రూ.50 వేల పైన పెన్షన్ పొందే స్కీమ్స్ కూడా ఉండటం గమనార్హం. ఎల్ఐసీ న్యూ పెన్షన్ ప్లస్ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, ఇండివిజ్యువల్ పెన్షన్ ప్లాన్ ను అమలు చేస్తుండటం గమనార్హం. రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం ఆప్షన్స్‌తో ఈ పాలసీ అమలవుతుండటం గమనార్హం.

వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఈ పెన్షన్ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. 25 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీలో చేరడానికి అర్హులు కాగా పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఉంటుందని సమాచారం అందుతోంది. కనీసం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్‌లో నెలకు రూ.3,000 చొప్పున చెల్లించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

రెగ్యులర్ ప్రీమియం పాలసీలో 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 42 సంవత్సరాల టర్మ్ ను ఎంచుకుంటే మంచిది. ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.21,83,069 రిటర్న్స్, రూ.2,55,397 యాన్యుటీ లభించే అవకాశం అయితే ఉంటుంది. వార్షిక రిటర్న్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువ మొత్తం వడ్డీ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 42 ఏళ్ల పాలసీ టర్మ్ ను ఎంచుకుని లక్ష రూపాయలు చెల్లిస్తే వార్షిక రిటర్న్స్ ప్రకారం రూ.3,69,948 రిటర్న్స్, రూ.42,808 యాన్యుటీ లభించే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే నెలకు రూ.50 వేలకు పైగా పెన్షన్ పొందే ఛాన్స్ కూడా ఉంటుంది.