ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, భోదనాసుపత్రులలో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి అదిరిపోయే తీపికబురు అందించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఈ సంస్థ దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 488 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాడ్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీలకు 42 సంవత్సరాల వయస్సు అర్హతగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 సంవత్సరాల వయస్సు అర్హతగా ఉంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పవచ్చు.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుందని చెప్పవచ్చు.