దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో అద్భుతమైన పాలసీలను అందిస్తూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనం చేకూరేలా చేస్తుండటం గమనార్హం. ఎల్ఐసీ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రం దీర్ఘకాలంలో మంచి బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటున్ది. ఎల్ఐసీ స్కీమ్స్ లో జీవన్ శాంతి పెన్షన్ ప్లాన్ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా పెన్షన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా కారణల వల్ల పాలసీదారుడు మరణిస్తే నామినీ బీమా మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు.
వేర్వేరు ఆప్షన్లు అందుబాటులో ఉండగా ఏ ఆప్షన్ ను ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చనే విషయం తెలుసుకుని కనీసం లక్షన్నర రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. 10 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 10,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పెన్షన్ రాని వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఎల్ఐసీ బ్రాంచ్ లేదా ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎల్ఐసీ పాలసీలలో ఇన్వెస్ట్ చేసే మొత్తం సురక్షితం అని చెప్పవచ్చు.