దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ పాలసీలలో జీవన్ ఆజాద్ పాలసీ కూడా ఒకటి. 15 నుంచి 20 సంవత్సరాల టర్మ్ తో ఈ పాలసీని కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. పాలసీ తీసుకున్న టర్మ్ కంటే 8 సంవత్సరాలు తక్కువగా ఈ పాలసీ కోసం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఈ పాలసీ బాగా పాపులర్ అవుతోంది.
50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ పాలసీ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హతలను కలిగి ఉంటారని చెప్పవచ్చు. పాలసీ మెచ్యూర్ అయిన సమయంలో పాలసీదారుని వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలని నిబంధనలు ఉన్నాయి. పిల్లల పేర్లపై పాలసీ తీసుకునే వాళ్లు 20 సంవత్సరాల టర్మ్ చొప్పున పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతని కుటుంబం పాలసీ బెనిఫిట్స్ పొందడానికి అర్హత కలిగి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు రుణం పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీలో కనిష్ఠంగా సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షలుగా ఉంది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.
ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. పాలసీ డాక్యుమెంట్లను చదివి ఈ పాలసీని తీసుకుంటే మంచిది. సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.