ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ గురించి తెలుసా.. ఎన్నో అదిరిపోయే బెనిఫిట్స్ తో?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న పాలసీలలో ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ కూడా ఒకటి కాగా ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పొదుపుతో పాటు జీవిత బీమా పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీ ద్వారా పాలసీదారు కుటుంబానికి రెండు రకాలుగా ప్రయోజనం కలుగుతుంది.

ఈ పాలసీ ద్వారా పొదుపు ప్రయోజనం పొందే అవకాశంతో పాటు ఆర్థిక భద్రతను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు బీమా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ పరిమిత కాల చెల్లింపు ఎండోమెంట్ ప్లాన్ కావడం గమనార్హం. ఈ పాలసీలో చేరిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే నామినీ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ పాలసీలో చేరిన వాళ్లు సులువుగా లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఈ పాలసీ వ్యవధి ఉంటుంది. కనీసం 2 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఈ పాలసీ ద్వారా హామీ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. మెచ్యూరిటీతో పోలిస్తే 8 సంవత్సరాలు తక్కువగా ఈ మొత్తాన్ని చెలించాల్సిఉంటుంది.

50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు మెచ్యూరిటీ తేదీ కంటే ముందే మరణిస్తే డెత్ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. వార్షిక ప్రీమియంతో పోలిస్తే ఏడు రెట్లు సమానంగా ఈ మొత్తం ఉంటుంది. సమీపంలోని ఏజెంట్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.