రోజుకు రూ.44 పొదుపుతో రూ.28 లక్షలు .. ఈ స్కీమ్ గురించి తెలుసా?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న పాలసీలలో ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ కూడా ఒకటి. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. ఈ స్కీమ్ లో పాలసీదారుడు మరణిస్తే నామినీ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ 100 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తుంది. రోజుకు 44 రూపాయల చొప్పున చెల్లించడం ద్వారా ఏడాదికి ఈ స్కీమ్ కోసం 15,298 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విధంగా 30 సంవత్సరాలు చెల్లిస్తే 30 సంవత్సరాల తర్వాత ఏడాదికి 40,000 రూపాయల చొప్పున పొందవచ్చు. ఈ విధంగా 100వ సంవత్సరం వరకు పొందే అవకాశం ఉంటుంది. 4.58 లక్షల రూపాయలు పొందవచ్చు. నెలకు కేవలం 1300 రూపాయలు చెల్లించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ పాలసీకి డబ్బు చెల్లించడం ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

100 ఏళ్ల వరకు బీమా కవరేజ్ లభిస్తుండటంతో ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లించే వాళ్లు తక్కువ టర్మ్ తో ప్రీమియం చెల్లించడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు జీవన్ ఉమాంగ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎల్ఐసీలో వేర్వేరు పాలసీలు ఉండగా ఆదాయం, ఖర్చులకు అనుగుణంగా పాలసీలను ఎంచుకుంటే మంచిది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు కొన్ని పాలసీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ పాలసీల వల్ల ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉండటం వల్ల ఆ పాలసీలపై ప్రజల దృష్టి ఉందని సమాచారం అందుతోంది.