ఎల్ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ పెట్టుబడితో ఒకేసారి చేతికి రూ.28 లక్షలు పొందే ఛాన్స్!

ఎల్ఐసీ పాలసీలను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందాలని భావించే వాళ్లకు జీవన్ తరుణ్ పాలసీ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ సూపర్ పాలసీ అవుతుంది.

రోజుకు కేవలం 171 రూపాయలు పొదుపు చేయడం ద్వారా ఒకేసారి చేతికి రూ.28 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల కోసం ఇది బెస్ట్ పాలసీ అవుతుందని చెప్పవచ్చు. పిల్లల చదువు కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ పాలసీ అదిరిపోయే పాలసీ అవుతుంది. ఈ పాలసీ నాన్ లింక్డ్ ప్లాన్ కాగా ఈ పాలసీని తీసుకున్న వాళ్లకు లాభం వస్తే ఆ లాభం బోనస్ రూపంలో అందుతుంది.

ఈ పాలసీ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ కాగా 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల కోసం ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం 75,000 రూపాయలకు ఈ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీకి సంబంధించి మెచ్యూరిటీ సమయం 25 సంవత్సరాలు కాగా 20 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ కోసం చెల్లించే మొత్తం 10 లక్షల రూపాయలు కాగా 25 సంవత్సరాల తర్వాత 28 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

చిన్న వయస్సులోనే పిల్లల పేరిట పాలసీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. పాలసీ తీసుకునే మొత్తాన్ని బట్టి చెల్లించే ప్రీమియంలో మార్పులు ఉంటాయి. సమీపంలోని ఎల్.ఐ.సీ ఏజెంట్ లేదా ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.