ఎల్ఐసీ జీవన్ లాభ్ సూపర్ పాలసీ.. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా రూ.54 లక్షలు!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. వినియోగదారులు ఎంచుకునే పాలసీల ఆధారంగా పొందే ప్రయోజనాలకు సంబంధించి మార్పులు ఉంటాయి. ఎల్ఐసీ జీవన్ లాభ్ సూపర్ పాలసీ తీసుకోవడం ద్వారా ఏకంగా 54 లక్షల రూపాయలు పొందవచ్చు.

ఈ పాలసీ తీసుకోవడం ద్వారా జీవిత బీమా కవరేజ్ లభించడంతో పాటు సేవింగ్స్ ప్రయోజనాలను సైతం సొంతం చేసుకోవచ్చు. పాలసీదారుడు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ లభించడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో నామినీ ఒకేసారి భారీ మొత్తం అందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్ఐసీ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఉత్తమమైనదని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో భాగంగా 30 ఏళ్ల వయస్సులో 20 లక్షల రూపాయల బీమా కవరేజ్ తీసుకుంటే నెలవారీ ప్రీమియం 7572 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ బెనిఫిట్స్ పొందవచ్చు. పాలసీ టర్మ్ 16 ఏళ్లు, 21 ఏళ్లు, 25 ఏళ్లు కాగా ఎంచుకునే టర్మ్ ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం మొత్తంతో పాటు బోనస్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏజెంట్ల ద్వారా లేదా డైరెక్ట్ గా ఈ పాలసీ ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీని తీసుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.