దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా కొన్ని అద్భుతమైన పథకాలను అమలు చేస్తుండగా ఆ పథకాల వల్ల దీర్ఘకాలికంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మన దేశంలో భద్రతా దళాల కోసం అదిరిపోయే స్కీమ్ అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా సైనికులు అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
గృహ రక్షక్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండగా మన దేశ సైన్యంలో పని చేసే సిబ్బంది కొరకు ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా భద్రతా దళాల సిబ్బందికి 2 కోట్ల రూపాయల వరకు లోన్ లభించనుందని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్ లో వడ్డీ రేటు 8.4 శాతంగా ఉండగా ఈ వడ్డీ రేటు అనుకూలం అనుకుంటేనే ఈ స్కీమ్ లో చేరవచ్చు.
క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ రుణాల మంజూరు జరగనుందని తెలుస్తోంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొంత కాలం పాటు ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణంతో పాటు ప్రాసెసింగ్ ఫీజులను సైతం మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం మన దేశ సైన్యంలో పని చేసే వాళ్లతో పాటు సిబ్బందికి సైతం ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుందని సమాచారం అందుతోంది.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల 30వ తేదీ ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. గత కొన్నేళ్లుగా ప్రజల నమ్మకాన్ని అందుకుంటున్న ఎల్‌ఐసీ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను ప్రకటిస్తుండటం గమనార్హం.