ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. సులువుగా 76 లక్షల రూపాయలు పొందే అవకాశం?

దేశీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలలో ఎల్ఐసీ బీమా రత్న పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ ద్వారా ఏకంగా 76 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. ఈ పాలసీ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివీజువల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావడం గమనార్హం. ఈ పాలసీ ద్వారా కచ్చితమైన బోనస్ పొందే ఛాన్స్ ఉంటుంది.

55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హుల్. కనీసం 5 లక్షల రూపాయల నుంచి ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. గరిష్టంగా 25 సంవత్సరాల టెన్యూర్ ను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టెన్యూర్ తో పోలిస్తే నాలుగు సంవత్సరాలు తక్కువ సమయం వరకు ఈ పాలసీకి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 20 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే ఏడాదికి లక్షా 18 వేల రూపాయల ప్రీమియం చెల్లించాలి.

పాలసీ తీసుకున్న వాళ్లకు 10 లక్షల రూపాయల వరకు సర్వైవల్ బెనిఫిట్స్ లభిస్తాయి. గ్యారంటీ అడిషన్స్, మెచ్యూరిటీ అడిషన్ కింద భారీ మొత్తం లభిస్తుంది. పాలసీదారుడు చనిపోతే నామినీ 53 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు సులువుగా లోన్ కూడా పొందవచ్చు. రెండేళ్లు ప్రీమియం చెల్లించిన వాళ్లకు లోన్ లభిస్తుందని చెప్పవచ్చు.

సరెండర్ వాల్యూలో 90 శాతం వరకు లోన్ రూపంలో పొందవచ్చు. ఈ పాలసీ ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని బ్రాంచ్ ద్వారా ఈ పాలసీ పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎల్.ఐ.సీ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.