ఎల్ఐసీ అద్భుతమైన పాలసీ.. తక్కువ పొదుపుతో సులువుగా రూ.50 లక్షలు పొందే ఛాన్స్!

రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి పొందాలని భావించే వాళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే పాలసీలను అందుబాటులోకి తెస్తోంది. రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వాళ్లు ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎల్ఐసీ పాలసీలలో బీమా రత్న పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండిబీజువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావడం గమనార్హం.

ఈ ప్లాన్ ను తీసుకునే వాళ్లు ఫార్ట్ టర్మ్ పేమెంట్ ఆప్షన్ ద్వారా మెచ్యూరిటీ సమయంలో బోనస్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. 55 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. కనీసం 5 లక్షల రూపాయలకు ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. 25 ఏళ్ల వరకు ప్లాన్ టర్మ్ ను ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎంచుకున్న టెన్యూర్ కంటే నాలుగేళ్లు తక్కువగా ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకున్నవారు మధ్యలో కూడా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు నెలకు 9600 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో 50 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. చెల్లించే మొత్తంతో పోల్చి చూస్తే రెట్టింపు డబ్బు లభిస్తుంది.

పాలసీదారుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే 50 లక్షల రూపాయల బీమా పొందే ఛాన్స్ ఉండగా సహజ మరణం అయితే 40 లక్షల రూపాయలు పొందవచ్చు. ఎక్కువ మొత్తంలో రిటర్న్ తో పాటు గ్యారంటీ బోనస్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.