లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళల కోసం వేర్వేరు సేవింగ్ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ఆ స్కీమ్స్ లో ఆధార్ శిలా యోజన కూడా ఒకటి కావడం గమనార్హం. మహిళలు భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్ అయిన ఈ స్కీమ్ హామీతో పాటు రాబడి, జీవిత బీమాను అందిస్తుండటం గమనార్హం.
ఆధార్ కార్డ్ ఉన్న మహిళలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ఠ వ్యవధి 20 ఏళ్లతో ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. రోజుకు 29 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా టెన్యూర్‌లో మొత్తం రూ.2,11,170 చెల్లించాలి. ఈ విధంగా 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.88 లక్షల లాభాన్ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మహిళలకు డబ్బును పొదుపు చేయడానికి, వారి జీవితాలను భద్రపరచుకోవడానికి ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతాతో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సౌలభ్యం ప్రకారం మీ ప్రీమియంలను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. . బడ్జెట్, ఆర్థిక లక్ష్యాల ప్రకారం పెట్టుబడి మొత్తం, ఫ్రీక్వెన్సీని ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఎప్పుడైనా పెట్టుబడి మొత్తాన్ని లేదా వ్యవధిని మార్చుకునే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు మధ్యలో ఆడవారు గరిష్టంగా 70 ఏళ్ల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.