ప్రధాన మంత్రి వయ వందన యోజనకి చివరి గడువు.. వెంటనే ఇలా అప్లై చేయడం..?

ప్రజలకు ఆర్థికంగా చేయూతనివ్వటానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా అనేక మంది ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా రైతులకు ,సీనియర్ సిటిజన్స్ కి, బాలికలకు చేయూతనివ్వటానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది. వయసు పైబడిన తర్వాత వృద్ధులకు ఆర్థికంగా ఆసరా అందించటానికి
పెన్షనర్లకు పెన్షన్ స్కీమ్స్ ని కూడా తీసుకు వచ్చింది.

ఇలా సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధాన మంత్రి వయ వందన యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కి పెన్షన్ అందిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. 26 మే 2020న ప్రారంభించిన ఈ పథకం ద్వారా వృద్ధులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు.31 మార్చి 2023లోపు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పూర్తి అయ్యాక భార్యాభర్తలిద్దరూ పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు. అలాగే వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పెన్షన్ ని పొందొచ్చు. రూ.15 ఇన్వెష్ట్ చేస్తే 7.40 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. వార్షిక పెన్షన్ రూ.51 వేలు. ప్రతీ నెలా పెన్షన్ కావాలంటే రూ.4100 ని పొందొచ్చు.

ఈ పాలసీ ని ఎలా తీసుకోవాలి..?

ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్ లో చేరాలనుకునేవారు భారత పౌరులై ఉండాలి. అలాగే 60 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ స్కీం లో చేరే అర్హత ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరాలనుకునే వారు దగ్గరలోని ఎల్ ఐ సి బ్రాంచ్ వెళ్లి అక్కడ ఈ స్కీం లో చేరవచ్చు. లేదా ఆన్ లైన్ లో LIC అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పాలసీ సెక్షన్ లో ఈ పాలసీ ని ఎంచుకుని మీరు అప్లై చేసేయచ్చు. అయితే ఈ పాలసీ కోసం వన్ టైమ్ ప్రీమియం చెల్లించాలి. ప్రధాన మంత్రి వయ వందన యోజన కోసం 31 మార్చి 2023లోపు దరఖాస్తు చేసేందుకు ఛాన్స్ వుంది.