ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చదువుకు దూరమవుతున్నారు. చదవాలనే ఆశ ఉన్నా కొంతమంది ఉన్నత చదువులు చదివే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. అయితే ఇలాంటి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలు సైతం పలు స్కాలర్ షిప్ లను అమలు చేస్తుండగా ఈ స్కాలర్ షిప్ వల్ల విద్యార్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.
ఈ స్కాలర్ షిప్ స్కీమ్ ద్వారా 2,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న యూజీసీ విద్యార్థులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఒంటరి ఆడపిల్ల పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండగా పీజీ చదివే విద్యార్థినులు రెండు సంవత్సరాల పాటు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తల్లీదండ్రులకు ఒకే ఒక్క కూతురు ఉంటే ఈ బెనిఫిట్ పొందవచ్చు.
ఇప్పటికే పీజీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థినులు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఏ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం పొందని వాళ్లు మాత్రమే ఈ స్కాలర్ షిప్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెబ్‌సైట్ ద్వారా అతి సులువుగా ఈ పథకం ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఆడపిల్లలకు ప్రయోజనం చేకూరేలా ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. బాలిక విద్యార్థులు ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ స్కాలర్ షిప్ ను యూజీసీ వెబ్ సైట్ ద్వారా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.