Vastu Tips: ఇంటి ద్వారం ముందు నెమలి ఈక ఉంచితే.. ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రతి ఇంట్లో మంచి శాంతి, సిరిసంపద, సుఖ సంతోషాలు కోరుకోవడం సహజం. ఇక వాస్తు శాస్త్రంలో నెమలి రెక్కలు ఇంటికి శుభాన్ని, సానుకూల శక్తిని తెస్తాయని నమ్మకం ఉంది. నెమలి ఈకలు కేవలం అందం కోసం కాకుండా.. మన ఇంటి వాతావరణాన్ని మారుస్తాయి, ఎన్నో కష్టాలను దూరం చేస్తాయని ప్రముఖులు, పండితులు చెబుతున్నారు.

వాస్తు నిపుణుల ప్రకారం, ఇంటి ప్రవేశద్వారం దగ్గర నెమలి రెక్కలు పెట్టడం అనేది అనుగ్రహాన్ని కలిగించే శుభ సూచిక అని పండితులు చెబుతున్నారు. ఇది దుష్టశక్తిని అడ్డుకుని, విధిలేఖను సానుకూలంగా మలచుతుంది. అలాగే, నెమలి విగ్రహం లేదా చిత్రం పెట్టినా అదే ఫలితం చేకూరుతుంది. ధనసమృద్ధి కోసం లాకర్లో, డబ్బు పెట్టెలో నెమలి రెక్కలు వేయాలని కూడా నమ్మకం. ఆకస్మిక ఖర్చులు తగ్గి, సంపద నిలకడగా పెరుగుతుందని పండితులు అంటున్నారు.

వైవాహిక జీవితంలో కూడా నెమలి రెక్కలకు విశేష ప్రాధాన్యం ఉంది. భార్యభర్తల మధ్య దోషాలు, అపార్థాలు ఎక్కువైతే బెడ్రూమ్లో నెమలి రెక్కలు పెట్టడం ద్వారా అనురాగం, ప్రశాంత వాతావరణం పెరుగుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. పిల్లల చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలన్నా, వారి పుస్తకాల మధ్య లేదా టేబుల్పై నెమలి రెక్కలు పెట్టితే మంచిదని చెబుతున్నారు.

వాస్తు దోషాల నివారణలోనూ నెమలి ఈకలు కీలక పాత్ర పోషిస్తాయి. 11 నెమలి రెక్కలను ఒకదానికొకటి కట్టి ఇంటి గోడకు తగిలించాలి. లేదంటే, వాటిని సీసాలో వేసి ఉంచాలి. ఇంకా ఇంటి ఆగ్నేయ దిశలో ఈకలు ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చూస్తే నెమలి రెక్కలు ఇంటికి కేవలం అలంకరణ దర్శనం కోసం ఉండవు. అవి భద్రత, ఆరాధన, సానుకూల శక్తికి సంకేతంగా మారతాయి. వాస్తు నిబంధనలు పాటిస్తూ నెమలి ఈకలు ఇంట్లో ఉంచితే శాంతి, సంపద అధికంగా పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ చిన్న మార్పు ద్వారా మీ ఇంట్లో నవశక్తి వెల్లివిరుస్తుందని నమ్మకం.