ఎల్ఐసీ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ పాలసీలలో ఒకటైన జీవన్ కిరణ్ పాలసీ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావడం గమనార్హం. ఈ పాలసీ కనీస వ్యవధి 10 సంవత్సరాలు కాగా గరిష్ట వ్యవధి 40 సంవత్సరాలు కావడం గమనార్హం. నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా ప్రీమియం చెల్లించే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ పాలసీ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ పర్సనల్ సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పాలసీ కాగా జీవిత బీమా తీసుకున్న వ్యక్తి అకాల మరణం పొందితే నామినీ ఎక్కువ మొత్తాన్ని పొందవచ్చు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.15,00,000 కాగా 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. కనీస వాయిదా ప్రీమియం రూ. 3,000 కాగా సింగిల్ ప్రీమియం పాలసీలకు రూ. 30,000గా ఉంటుంది.
మరణంపై హామీ మొత్తం వార్షిక ప్రీమియం కంటే ఏడు రెట్లు అత్యధికంగా ఉండటంతో ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. సింగిల్ ప్రీమియంలో 125% పొందే ఛాన్స్ ఉంటుంది. ఆత్మహత్యలు మినహా అన్ని రకాల మరణాలను ఈ పాలసీ కవర్ చేస్తుందని చెప్పవచ్చు. సమీపంలోని బ్రాంచ్ లేదా ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా ఈ పాలసీ గురించి తెలుసుకోవచ్చు.
ఎల్ఐసీ పాలసీలను తీసుకోవడం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించినట్లు అవుతుంది. ఎల్ఐసీ పాలసీలపై ఆసక్తి ఉన్నవాళ్లకు అన్ని పాలసీల గురించి అవగాహన తెచ్చుకుని అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకునే అవకాశం ఉంటుంది.