ఈ మధ్య కాలంలో చాలామందిని వయస్సుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. మోకాళ్ల నొప్పిని భరించలేకపోతున్నానని ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందని చాలామంది చెబుతున్నారు. ప్రస్తుతం మధ్య వయస్కుల నుంచి సైతం ఈ తరహా కామెంట్లు వినిపిస్తున్నాయనే సంగతి తెలిసిందే. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల కొంతమంది 40 సంవత్సరాలకే మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారు.
క్రీడాకారులు సైతం మోకాళ్ల నొప్పుల బారిన పడుతుండటం గమనార్హం. అయితే ఇంతలా వేధిస్తున్న మోకాళ్ల నొప్పులకు కొన్ని చిట్కాల ద్వారా చెక్ పెట్టవచ్చు. సాధారణంగా మోకాళ్ల నొప్పి అంటే సర్జరీ ద్వారా మాత్రమే చెక్ పెట్టవచ్చని చాలామంది భావిస్తారు. అయితే ఇప్పుడు కొత్త తరహా విధానాలు సైతం అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టడానికి హై డెన్సిటీ ప్లేట్లెట్ రిచ్ ప్లస్మా ట్రీట్మెంట్ పై చాలామంది ఆధారపడుతున్నారు. ఈ విధానంలో ప్లేట్ లెట్స్ ను వేరు చేసి మోకాళ్లలో గుజ్జు అరిగిన చోట స్కానింగ్ మిషన్ సహాయంతో ఇంజక్షన్ చేయడం జరుగుతుంది. ప్లేట్ లెట్స్ లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ కు పునరుత్పత్తి గుణాలు సైతం ఉంటాయనే సంగతి తెలిసిందే.
ఈ విధానం ద్వారా నొప్పి, వాపు సైతం వేగంగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. తక్కువ సమయంలోనే ఈ చికిత్సను పూర్తి చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక్కరోజు మాత్రం ఆస్పత్రిలో ఉంటే సరిపోతుంది. మరుసటిరోజే రోగిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. భుజం, మోచేయి నొప్పులను సైతం ఈ విధానం ద్వారా పరిష్కరించవచ్చు.