మనలో చాలామంది తినడానికి ఎంతగానో ఇష్టపడే పండ్లలో కివీ పండ్లు కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ పండ్లు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఈ పండ్లను డైట్ లో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కివీ పండ్లను తీసుకోవడం ద్వారా నాజూకైన చర్మం పొందే అవకాశం ఉంటుంది. ఈ పండ్లలో ఉంటే విటమిన్ సి ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచడంలో తోడ్పడుతుంది.
వంద గ్రాముల కివీ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం పాలిపోకుండా, ముడతలు పడకుండా చేయడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. కివీ పండ్లు తీసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
కివీ పండ్లు తినడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరం కావడంతో పాటు జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. 100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల ఫైబర్ ఉండగా ఈ పండ్ల ద్వారా శరీరానికి కావాల్సిన 12 శాతం ఫైబర్ అందుతుంది. కివీ పండులో సెరటోనిన్ లాంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉండటం గమనార్హం. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
కివీ పండ్లను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌వల్ల శరీరానికి నష్టం జరగకుండా కాపాడటంతో కివీ పండ్లు ఉపయోగపడతాయి. కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్ ఉంటుంది. గర్భిణీలు కివీ పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.