పేద ప్రజలకు శుభవార్త.. రోజుకు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షలు పొందే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో సంతోషంగా జీవనం సాగించాలంటే డబ్బు ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. పొదుపు సూత్రాన్ని పాటిస్తూ డబ్బును పొదుపు చేస్తే మాత్రమే కష్టకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు పొదుపు చేసే డబ్బులతో భవిష్యత్తు అవసరాలను సులువుగా తీర్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సీనియర్ సిటిజన్లు డబ్బు పొదుపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.

సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, అటల్ పెన్షన్ స్కీమ్, మంత్‌లీ ఇన్‌కం స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మంత్లీ ఇన్ కం స్కీమ్ ద్వారా ప్రతి నెలా పింఛన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్.ఐ.సీ జీవన్ ఆనంద్ పాలసీని ఎంచుకోవడం ద్వారా రోజుకు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షలు పొందే ఛాన్స్ అయితే ఉండనుందని సమాచారం అందుతోంది.

తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీలు బెస్ట్ ఆప్షన్ అవుతాయని చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు ఎన్నో మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. నెలకు 1358 రూపాయల చొప్పున 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పథకంలో రెండుసార్లు బోనస్ ఇవ్వబడుతుంది.

యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ మరియు న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ ప్రయోజనాలను ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. పాలసీదారు మరణిస్తే నామినీ 125 శాతం డెత్ బెనిఫిట్ పొందవచ్చు. అయితే ఈ పాలసీ తీసుకుంటే పన్ను మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉండదు.