ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే నెలకు రూ.50,000 పెన్షన్.. ఎలా పొందాలంటే?

మనలో చాలామంది పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఒక పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏకంగా రూ.50,000 పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. దీర్ఘకాలంలో సంపద కూడబెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో డబ్బులను పెట్టుబడులు పెట్టడం ద్వారా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు మాత్రమే మినహాయింపును పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీసీడీ కింద మినహాయింపులు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. సామాజిక భద్రతా పెట్టుబడి పథకాల్లో భాగంగా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి 75 : 25, 50 : 50, 40 : 60 ఆప్షన్స్ ను ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. దీర్ఘకాలం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 25 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెడితే ఎక్కువ లాభాలు సొంతమవుతాయి.

నెలకు రూ.4,000 చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 45 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయడం వల్ల 16 లక్షల పెట్టుబడితో కోటీ 16 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. జమ చేసిన మొత్తంలో 40 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకుని మిగతా డబ్బులు ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసినా నెలకు 77,000 రూపాయల పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.